హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు మోదీ, పుతిన్ భేటీ

బ్రిక్స్ సదస్సు వేదికగా భారత్, రష్యా బంధం మరింత బలపడనుంది. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఇరు దేశాల నేతలు వాణిజ్యం, రక్షణ, ఇంధన రంగాలతో పాటు టెక్నాలజీ, ఫార్మా రంగాల్లో సహకారం పెంపుపై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే సరిహద్దు చెల్లింపుల విధానాలపై నేతలు కీలక మంతనాలు జరపనున్నారు.