AP: బంగాళాఖాతంలో అల్పపీడనం దృష్ట్యా మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని కోరారు. అధికారులు తీర ప్రాంతాల్లోని పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని.. వాతావరణ సూచనలను ఎప్పటికప్పుడు మత్స్యకారులకు చేరవేరయాలని ఆదేశించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. మత్స్యకారుల భద్రతే తమకు ముఖ్యమని మంత్రి చెప్పారు.
వార్తలు
మత్స్యకారుల భద్రతే ముఖ్యం: అచ్చెన్న


