హైదరాబాద్: 28°C
వార్తలు

స్వచ్ఛ ఆటోలతోనే చెత్త సేకరణ చేయాలి: కవిత

TG: స్వచ్ఛ ఆటోలపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయాలని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. చెత్త సేకరణకు డబ్బులు వసూలు చేసే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. స్వచ్ఛ ఆటోలతోనే చెత్త సేకరిస్తామని ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. సీఎం స్పష్టత ఇవ్వకపోతే 40 వేల మంది స్వచ్ఛ ఆటో కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కవిత హెచ్చరించారు.