హైదరాబాద్: 28°C
వార్తలు

'సజ్జనులతోనే స్నేహం'.. మోదీ ఆసక్తికర పోస్ట్

రేపు, ఎల్లుండి బ్రిక్స్ సదస్సు జరగనున్న వేళ ప్రధాని మోదీ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. ప్రపంచ సంక్షేమమే లక్ష్యంగా సదస్సులో సానుకూల, అర్థవంతమైన చర్చలు జరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. అదే సమయంలో 'సజ్జనులతోనే స్నేహం, వాదన చేయాలి.. దుర్జనులతో ఎలాంటి సహవాసం చేయకూడదు' అనే అర్థం వచ్చే సుభాషితాన్ని ఆయన పంచుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.