హైదరాబాద్: 28°C
వార్తలు

భారతీయ సంస్కృతిని గగనమెత్తిన రోజు ఇదే!

నేడు(సెప్టెంబర్ 11) 'దిగ్విజయ్ దివస్'. 1893లో చికాగోలో జరిగిన సర్వమత మహాసభలో స్వామి వివేకానంద చారిత్రక ప్రసంగం చేసి భారత కీర్తిపతాకను విశ్వవ్యాప్తం చేసిన పవిత్రమైన రోజు ఇది. 'అమెరికా సోదర, సోదరీమణులారా' అంటూ ఆయన చేసిన ప్రసంగం ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేసింది. భారతీయ సనాతన ధర్మం, ఆధ్యాత్మిక ఔన్నత్యం, సర్వమత సమానత్వాన్ని చాటిన ఆ రోజును స్మరిస్తూ ఈ దినోత్సవం జరుపుకుంటారు.