హైదరాబాద్: 28°C
తెలంగాణ

జనగామ జెడ్పీ సీఈవోగా పి. బలరామరావు

JN: జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా పి. బలరామరావు నియమితులయ్యారు. గురువారం స్థానిక జెడ్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు హైదరాబాద్ హయత్‌నగర్ సర్కిల్ డిప్యూటీ ప్రాజెక్టు అధికారిగా పనిచేశారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జ్ డిప్యూటీ సీఈవో నాగశేషాద్రి సూరి, అధికారులు, సిబ్బంది బలరామరావును అభినందించారు.