హైదరాబాద్: 28°C
వార్తలు

రేపటి నుంచే బ్రిక్స్‌ సదస్సు

రేపటి నుంచి రెండు రోజుల పాటు జరిగే 18వ బ్రిక్స్ సమ్మిట్ కోసం ఢిల్లీలోని భారత్ మండపం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు, ఇతర ఏజెన్సీలతో కలిసి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 15,000 మంది పోలీస్ సిబ్బంది, 200 కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించారు. VVIPల రాకపోకల కారణంగా పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ప్రజలకు సూచనలు జారీ చేశారు.