హైదరాబాద్: 28°C
వార్తలు

భారత్‌కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్

దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ్టి నుంచి బ్రిక్స్ సదస్సు జరగనుంది. సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విచ్చేశారు. విమానాశ్రయంలో ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోదీతో పుతిన్ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. డిఫెన్స్, ఖనిజాల సరఫరా, రేర్ ఎర్త్ మెటల్స్‌పై చర్చించే అవకాశం ఉంది. భారత్ ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ సదస్సులో ఆయన వివిధ దేశాల నేతలతో సమావేశమవుతారు.