హైదరాబాద్: 28°C
వార్తలు

ఆమె సాధ్విగా మారవచ్చు: మధ్యప్రదేశ్‌ హైకోర్టు

మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఓ 20 ఏళ్ల యువతి వాస్తవిక జీవితాన్ని వదిలేసి సాధ్విగా మారేందుకు అంగీకరిస్తూ ఆదేశాలు జారీ చేసింది.  ఓ మేజర్‌గా, తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం, రాజ్యాంగం ప్రకారం తనకు నచ్చిన మతాన్ని ఆచరించే స్వేచ్ఛ ఆమెకు ఉందని వెల్లడించింది. తల్లిదండ్రుల నుంచి ఆమెకు రక్షణ కల్పించాలని పోలీసులకు సూచించింది.