హైదరాబాద్: 28°C
వార్తలు

ఆ వీడియోలను నమ్మి మోసపోవద్దు: ప్రియాంక కార్యాలయం

కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకా గాంధీ పేరుతో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న నకిలీ వీడియోలపై ఆమె కార్యాలయం స్పందించింది. పలు సంస్థల్లో పెట్టుబడులు పెట్టాలంటూ ప్రియంకా చెబుతున్నట్లు ఉన్న వీడియోలను నమొద్దని సూచించింది. వాటిని ఏఐతో రూపొందించినట్లు చెప్పింది. వాటిని నమ్మి మోసపోవద్దని.. ఇలాంటి పోస్టులు కనిపిస్తే వెంటనే ఫిర్యాదు చేసి.. బ్లాక్ చేయాలని ప్రజలను కోరింది.