హైదరాబాద్: 28°C
వార్తలు

వందేమాతరంలో రెండు చరణాలే పాడండి: ప్రభుత్వం

జాతీయ గీతం వందేమాతరంపై కర్ణాటక ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, అధికారిక వేడుకల్లో వందేమాతరం తొలి రెండు చరణాలను మాత్రమే పాడాలని ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో గీతాన్ని పాడే విషయంలో గౌరవం, సరైన ప్రోటోకాల్ ఉండేలా చూడాలని వెల్లడించింది. అయితే ఈ నిర్ణయం రాజకీయంగా చర్చకు దారి తీసే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.