నిర్మాణంలో ఉన్న వంతెన కూలిన ఘటన బీహార్ వైశాలి జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. బకర్‌పుర్ - మానిక్‌పుర్ జాతీయ రహదారి అభివృద్ధిలో భాగంగా ఈ వంతెన నిర్మిస్తున్నారు. ఉదయం పిల్లర్లపై బీమ్ లాంచర్‌ను అమరుస్తుండగా ఒక్కసారిగా కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రలను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.
వార్తలు
నిర్మాణంలో ఉన్న వంతెన కూలి.. కార్మికులకు గాయాలు


