హైదరాబాద్: 28°C
వార్తలు

బ్రిక్స్ కోసం ఢిల్లీలో భారీ భద్రత

బ్రిక్స్ సదస్సులో భాగంగా పలు దేశాధినేతలు వస్తున్న నేపథ్యంలో ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. దేశ రాజధానిలో పలు అంచెల భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేశారు. భారీ భద్రత కోసం 25,000 మందిపైగా పోలీసులను మోహరించారు. వీరిలో 1000 మందికిపైగా ఢిల్లీ పోలీస్ స్వాట్, 100 మందికి పైగా NSG కమాండోలు ఉన్నారని అధికారులు తెలిపారు. ఐబీ, SPG, పారామిలిటరీ బలగాలు సమన్వయంతో పనిచేస్తున్నట్లు చెప్పాయి.