హైదరాబాద్: 28°C
వార్తలు

స్పేస్‌ పరిశోధనల్లో భారత్‌తో చేతులు కలపండి: ప్రధాని

అంతరిక్ష రంగంలో అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భవిష్యత్ పరిశోధనల్లో భారత్‌కు సహ ప్రయాణికులుగా మారాలని ఫ్రాన్స్, ఇతర దేశాలను కోరారు. 1960ల నుంచి భారత్, ఫ్రాన్స్‌ అంతరిక్ష రంగంలో నమ్మకమైన భాగస్వాములుగా ఉన్నాయని తెలిపారు. తక్కువ ఖర్చుతో అత్యుత్తమ సాంకేతికతను అందించడంలో ఇస్రో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుందని కొనియాడారు.