హైదరాబాద్: 28°C
వార్తలు

జయపురం సబ్ కలెక్టర్‌గా శుభ్ర పండా

ఒడిశాలోని జయపురం సబ్ కలెక్టర్‌గా శుభ్ర పండా నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్న సబ్ కలెక్టర్ జాదుమణి నాయిక్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. శుభ్రపండా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమెకు జయపురం మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారిగా కూడా అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే జాదుమణికి తదుపరి పోస్టింగ్ ఎక్కడ ఇస్తారనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.