హైదరాబాద్: 28°C
వార్తలు

బ్రిక్స్‌ సదస్సుకు జిన్‌పింగ్‌.. చైనా మీడియా స్పష్టం

భారత్‌లో జరిగే బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరవుతారా లేదా అనే సందిగ్ధతకు చైనా మీడియా తెరదించింది. బ్రిక్స్ సదస్సు కోసం జిన్ పింగ్ భారత్‌లో అడుగు పెట్టబోతున్నట్లు ప్రకటించింది. ప్రధాని మోదీతో జిన్‌పింగ్ భేటి అయి పలు అంశాలపై చర్చించనున్నట్లు వెల్లడించింది. 2020 గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా జిన్‌పింగ్ భారత్‌కు వస్తున్నారు.