హైదరాబాద్: 28°C
వార్తలు

అబూసలేంకు సుప్రీంకోర్టు ఝలక్

1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న గ్యాంగ్ స్టర్ అబూసలేంకు సుప్రీంకోర్టు ఝలక్ ఇచ్చింది. 25 ఏళ్ల జైలు శిక్షను ఇప్పటికే పూర్తి చేశానని.. అందువల్ల తనను జైలు నుంచి ముందుస్తుగా విడుదల చేయాలని కోరుతూ అతను వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ మేరకు బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.