హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీతో భేటీ కానున్న చైనా అధ్యక్షుడు

ఢిల్లీ వేదికగా ఈనెల 12న జరిగే 18వ బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. 2020 గల్వాన్ ఘర్షణల తర్వాత వీరిద్దరూ తొలిసారి ముఖాముఖి భేటీ కానున్నారు. బ్రిక్స్ సదస్సు కోసం జిన్‌పింగ్ శనివారం ఢిల్లీకి రానున్నారు. ఏడేళ్ల తర్వాత ఆయన భారత్‌లో పర్యటిస్తుండటం, సరిహద్దు ఉద్రిక్తతల మధ్య ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.