హైదరాబాద్: 28°C
వార్తలు

RSS కంచుకోటపై సీఎం డీకే కన్ను

ఆర్ఎస్ఎస్, బీజేపీలకు కంచుకోటగా ఉన్న దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాలపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కన్నేశారు. బెంగళూరు దాటి తొలిసారిగా ఈనెల 18న మంగళూరులో కేబినెట్ భేటీ నిర్వహించాలని ఆయన ప్రభుత్వం నిర్ణయించింది. 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి, మూడు దశాబ్దాలుగా ఆర్ఎస్ఎస్ 'హిందుత్వ ల్యాబ్‌'గా ఉన్న ఈ కోస్తా ప్రాంతంలో కాంగ్రెస్ పాగా వేయడమే ఈ భేటీ ప్రధాన వ్యూహంగా తెలుస్తోంది.