హైదరాబాద్: 28°C
వార్తలు

అర్హత ఉన్న వారికి పింఛన్లు: సీతక్క

TG: రాష్ట్రంలో 4.66 లక్షల మంది దివ్యాంగులు పింఛన్‌ పొందుతున్నారని మంత్రి సీతక్క తెలిపారు. అర్హులైన దివ్యాంగుల నుంచి పింఛన్‌ కోసం దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించిందన్నారు. దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 15 చివరి తేదీగా పేర్కొన్నారు. దివ్యాంగుల కేటగిరీలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అర్హత ఉన్న వారికి పింఛన్లు అందజేస్తామని స్పష్టం చేశారు.