హైదరాబాద్: 28°C
వార్తలు

గ్యాంగ్‌స్టర్‌ అబూసలెంకు సుప్రీంలో భారీ షాక్

1993 నాటి ముంబై వరుస పేలుళ్ల కేసులో దోషిగా శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ అబూసలెంకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. తనను కస్టడీ నుంచి వెంటనే విడుదల చేయాలని కోరుతూ సలెం సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. అతడి అభ్యర్థనను తోసిపుచ్చుతూ పిటిషన్‌ను కొట్టివేసింది.