హైదరాబాద్: 28°C
వార్తలు

పనుల తీరుపై సిగ్గుపడుతున్నా: గడ్కరీ

ముంబై-గోవా హైవే పనుల్లో విపరీతమైన జాప్యంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అసహనం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నత్తనడకన సాగుతున్న తీరుపై తాను సిగ్గుపడుతున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే పనులు పూర్తయ్యాక ఆ హైవే ప్రారంభోత్సవానికి తాను రాబోనని స్పష్టం చేశారు. పనాజీలో ఓ కారిడార్‌ను ప్రారంభించిన సందర్భంగా సొంత శాఖ ప్రాజెక్టుపైనే గడ్కరీ ఈ స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు.