హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీ-పుతిన్ భేటీ.. చర్చించే అంశాలివే!

ప్రధానితో రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీలో ప్రధానంగా ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులను మోదీకి ఆయన వివరించనున్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా గ్లోబల్ ఎకానమీ, చమురు, గ్యాస్ సరఫరాలపై పడుతున్న ప్రభావంపై చర్చిస్తారు. అలాగే రష్యాలో భారతీయ కంపెనీల పెట్టుబడుల పెంపు, పరస్పర వాణిజ్యం, రవాణా రంగంలోని ప్రాజెక్టులపైనా ఈ సమావేశంలో అత్యంత నిర్మాణాత్మక చర్చలు జరగనున్నాయని అధికారులు తెలిపారు.