హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు ఢిల్లీకి పుతిన్.. మోదీతో భేటీ

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రేపు భారత్‌కు రానున్నారు. ఢిల్లీ వేదికగా జరగనున్న 18వ బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా శుక్రవారం ప్రధాని మోదీతో పుతిన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇరువురు నేతల మధ్య రక్షణ ఒప్పందాలు, కీలక ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరగనున్నాయని క్రెమ్లిన్ ప్రతినిధి పెస్కోవ్ తెలిపారు. ఇరు దేశాలకు ఈ భేటీ అత్యంత కీలకం.