ఢిల్లీలోని భారత్ మండపం 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు సిద్ధమవుతోంది. ఈనెల 12, 13న జరిగే అంతర్జాతీయ సదస్సుకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ, భద్రతా విభాగాలు ముమ్మర ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాయి. దాదాపు 40 మంది ప్రపంచ నేతలు రానున్న నేపథ్యంలో సుమారు 25వేల భద్రతా సిబ్బందిని కేంద్రం రంగంలోకి దింపింది. ఇప్పటికే టాప్ లగ్జరీ హోటల్స్ అన్నీ ఫుల్ అయిపోయినట్లు సమాచారం.
వార్తలు
బ్రిక్స్ సదస్సుకు ముమ్మర ఏర్పాట్లు


