భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో ప్రైవేట్ భాగస్వామ్యం పెరుగుతున్నందున ఉద్యోగుల్లో ప్రైవేటీకరణ భయాలు వ్యక్తమవుతున్నాయి. వీటిని నివారించేందుకు ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ వివిధ విభాగాల ఉద్యోగులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇస్రోను ఎప్పటికీ ప్రైవేటీకరించబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగంలో నడిచే స్వతంత్ర సంస్థగానే ఉంటుందని ఉద్యోగులకు భరోసా ఇచ్చారు.
వార్తలు
ఇస్రోను ప్రైవేటీకరించంబోం: వి. నారాయణన్


