కృష్ణా: ఉయ్యూరు మండలంలోని 33 కేవీ నందమూరు ఫీడర్ నిర్వహణ పనుల (PMI వర్క్) కారణంగా గురువారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ డీ. రాజశేఖర్ బాబు తెలిపారు. పెద్ద ఓగిరాల సబ్‌స్టేషన్ పరిధిలోని పెద ఓగిరాల, చిన్న ఓగిరాల, ఆకునూరు గ్రామాల్లో ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు గృహ, వాణిజ్య, వ్యవసాయ బోర్లకు కరెంట్ ఉండదని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
వార్తలు
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


