హైదరాబాద్: 28°C
వార్తలు

టీవీకే-కాంగ్రెస్ కూటమికి పేరు ఖరారు

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం విజయ్ నేతృత్వంలోని కూటమికి ఎట్టకేలకు పేరు ఖరారైంది. కూటమికి 'సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయన్స్' అని నామకరణం చేశారు. ఈ పేరుకు కూటమిలోని అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. రాష్ట్ర ప్రగతికి, ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని ఈ సందర్భంగా కూటమి ప్రతినిధులు స్పష్టం చేశారు.