హైదరాబాద్: 28°C
వార్తలు

100% ఇంటింటి చెత్త సేకరణే లక్ష్యం : కమిషనర్

కర్నూలు నగరంలోని 137 సచివాలయాల పరిధిలో ప్రతి ఇంటి నుంచి చెత్తను 100 శాతం సేకరించేలా పిన్‌పాయింట్‌ ప్రోగ్రామ్‌ను పక్కాగా అమలు చేయాలని కమిషనర్‌ చల్లా ఓబులేసు ఆదేశించారు. బుధవారం కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ-ఆటోలను సమర్థంగా వినియోగించాలని ఆయన అన్నారు. డ్రైవర్ల గైర్హాజరు, వాహనాల మరమ్మతుల సమయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు.