హైదరాబాద్: 28°C
వార్తలు

టీనేజర్లలో చదివే శక్తి తగ్గుతుంది: నివేదిక

డిజిటల్ యుగంలో ఉన్న టీనేజర్లలో చదివే శక్తి తగ్గిపోతోందని తాజా స్వరేలో వెల్లడైంది. 2015-2025 మధ్య ఉన్న పిల్లల్లో ఒక అంశాన్ని చదివి అర్థం చేసుకునే సామర్థ్యం ఏకంగా 28 పాయింట్లు పడిపోయిందని పిసా అధ్యయనం తెలిపింది. 2015లో 489 పాయింట్లుగా ఉన్న సగటు రీడింగ్ స్కోరు 2025 నాటికి 461 పాయింట్లకు తగ్గిందని పేర్కొంది. కనీసం చదివే పరిజ్ఞానం లేని పిల్లల సంఖ్య 10 శాతం పెరిగిందని చెప్పింది.