హైదరాబాద్: 28°C
వార్తలు

ఖర్గే‌పై నితిన్ నబీన్ విమర్శలు

కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విమర్శించారు. విభజన రాజకీయాలతో ఉత్తరాఖండ్‌ పవిత్ర భూమిని కలుషితం చేయలేరని తెలిపారు. పేదలకు దేశ వనరులపై తొలి హక్కు ఉందని ప్రధాని మోదీ చెబుతుంటే.. మైనారిటీలకు తొలి హక్కు ఉందని కాంగ్రెస్‌ చెబుతుందని మండిపడ్డారు. దేశ సంస్కృతి, వారసత్వంతో సంబంధం లేని వారు సమాజ విభజన రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు.