W.G: వినాయక చవితి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని కలెక్టర్ నాగరాణి పిలుపునిచ్చారు. బుధవారం శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ నయీం అస్మితో కలసి మట్టి గణపతి విగ్రహా ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఇళ్లతో పాటు మండపాల్లోనూ పర్యావరణ హిత గణేశుడికే ప్రాధాన్యమివ్వాలన్నారు.
వార్తలు
మట్టి గణపతినే పూజిద్దాం: కలెక్టర్ నాగరాణి


