హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నిత్యావసర ధరలు తగ్గించాలి'

PPM: నిత్యావసర సరుకుల ధరలను వెంటనే తగ్గించి, బ్లాక్‌ మార్కెట్‌, దళారీ దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బియ్యం, పప్పులు, వంట నూనె, కూరగాయలతో పాటు గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్ ధరలను నియంత్రించి సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పించాలని కోరారు.