హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఈరోజు ఎన్నటికీ మర్చిపోలేని చీకటి రోజు'

VSP: సెప్టెంబర్ 9 తెలుగు జాతి చరిత్రలో ఎన్నటికీ మర్చిపోలేని చీకటి రోజు అని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రజాసేవకు అంకితమైన సీఎం చంద్రబాబుని అక్రమ కేసులతో అరెస్ట్ చేసి వేధించడం నాటి గొడ్డలి పార్టీ నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. న్యాయస్థానాల్లో నిజం గెలిచి ధర్మం, న్యాయం చివరికి గెలుస్తాయనే విషయాన్ని మరోసారి చాటి చెప్పిందని తెలిపారు.