హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

11 నుంచి కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే

VZM: జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఈ నెల 11 నుంచి 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు DMHO జీవనరాణి తెలిపారు. ఈ మేరకు బుధవారం వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కుష్టు వ్యాధి అనుమానితులను గుర్తించి సకాలంలో నిర్ధారణ పరీక్షలు, ఎండీటీ చికిత్స అందించేందుకు చర్యలు చేపట్టనున్నామన్నారు.