ప్రకాశం: పంట వేసిన ప్రతి రైతు సెప్టెంబర్ 15లోపు తప్పనిసరిగా ఈ-క్రాప్ నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి దేవేంద్ర గౌడ్ సూచించారు. కంభం మండలంలోని తురిమెళ్ల, నర్సిరెడ్డిపల్లి గ్రామాల్లో బుధవారం నిర్వహించిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ-క్రాప్ నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే పంట బీమా, పంట నష్టపరిహారం తదితర పథకాలు వర్తిస్తాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
‘ఈ-క్రాప్ నమోదు సెప్టెంబర్ 15లోపు తప్పనిసరి’


