SKLM: తిలారు రైల్వే స్టేషన్ ముందు అధ్వాన్నపు పరిస్థితులపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చిన్నపాటి వర్షం వస్తే చాలు, స్టేషన్ ప్రవేశ ద్వారం వద్ద మురికి నీరు నిల్వ ఉండి చెరువును తలపిస్తోంది. వర్షం తగ్గి వారం రోజులవుతున్నా ఈ నీరు బయటకు పోయే మార్గం లేకపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రైల్వే స్టేషన్ ముందు అధ్వాన్నపు పరిస్థితులు


