హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయ పారా స్పోర్ట్స్‌కు గౌతమ్ ఎంపిక

CTR: పుంగనూరు గూడూరుపల్లె పాఠశాలకు చెందిన దివ్యాంగ విద్యార్థి గౌతమ్ జాతీయ పారా స్పోర్ట్స్ మీట్ శిక్షణకు ఎంపికైనట్లు హెచ్‌ఎం మహేష్ నారాయణ బుధవారం తెలిపారు. గతంలో రాష్ట్రస్థాయి పారా పోటీల్లో 400 మీటర్ల పరుగు పందెంలో గౌతమ్ ప్రథమ స్థానంలో నిలిచారు. జాతీయస్థాయి పోటీల శిక్షణ కోసం ఏలూరు జిల్లాలోని హీల్స్ పాఠశాలలో 60 రోజుల శిక్షణకు ఎంపికయ్యారు.