హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గర్భవతులు పౌష్టికాహారం తీసుకోవాలి

KDP: గర్భం దాల్చినప్పటి నుంచి మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించి పౌష్టికాహారం తీసుకోవాలని గైనకాలజిస్ట్ మౌనిక సూచించారు. మాధవరం-1PHCలో బుధవారం గర్భవతులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. గర్భవతులు ఆకుకూరలు, పాలు, గుడ్లు వంటి పోషకాహారం తీసుకోవాలన్నారు. గర్భం దాల్చిన వెంటనే వైద్యుల సలహాతో పరీక్షలు చేయించుకుని ఆరోగ్య కేంద్రంలో నమోదు చేయించుకోవాలన్నారు.