హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పేపర్ మిల్లు కాలుష్యంపై చర్యలు ఎక్కడ..?'

E.G: ఆంధ్ర పేపర్ మిల్లు కాలుష్యం వల్ల ప్రజలు ప్రాణాలను పణంగా పెట్టాల్సి రావడం దారుణమని ఆర్పీసీ వ్యవస్థాపకుడు మేడా శ్రీనివాస్ అన్నారు. బుధవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కుళాయి పన్ను కట్టకపోతే నీటి సరఫరా నిలిపివేసే అధికారులు, పేపర్ మిల్లుకు ఎందుకు నిలపడం లేదని ప్రశ్నించారు. పుష్కరాలకు 3 నెలల ముందే మిల్లు పనులు ఆపేయాలన్నారు.