E.G: 2027 మార్చిలో నిర్వహించనున్న ఉల్లాస్-అక్షర ఆంధ్ర పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ఉల్లాస్ కార్యక్రమం ద్వారా 2025-29 నాటికి జిల్లాలో 15 నుంచి 60 ఏళ్ల వయసు గల 2,96,437 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు.
ఆంధ్రప్రదేశ్
100 శాతం ఉత్తీర్ణత సాధించాలి: కలెక్టర్


