హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాఫీ పరిశోధనా స్థానం స్వర్ణోత్సవాలు

ASR: ఏజెన్సీలో కాఫీ రంగానికి 50 ఏళ్లుగా సేవలందిస్తున్న ఆర్‌వీ నగర్ ప్రాంతీయ కాఫీ పరిశోధనా స్థానం స్వర్ణోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ నిశాంతి బుధవారం అధికారులను ఆదేశించారు. 1976లో ఏర్పాటైన ఈ కేంద్రం గిరిజన ప్రాంతంలో కాఫీ సాగు విస్తరణకు కృషి చేసిందన్నారు. వేడుకల్లో ఫొటో ఎగ్జిబిషన్, సాంకేతిక సమాచార స్టాళ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు.