ASR: పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతా నియమాలు, నిబంధనలు, ప్రమాదాల నివారణ, ఆ సమయంలో బాధితులకు తక్షణ సహాయం అందించడంపై మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ సాయి రమేశ్ అవగాహన కల్పించారు. ప్రమాద బాధితులను తక్షణం ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడేవారికి రూ.25వేల నగదు ప్రోత్సాహకం గురించి వివరించారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన


