హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోడ పత్రికలను ఆవిష్కరించిన కలెక్టర్

AKP: పోషణ మాసం-2026ను జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన గోడపత్రికలను కలెక్టరేట్‌లో ఇవాళ ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా “మన అంగన్వాడీ-మన బాధ్యత”తో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం, ఆరోగ్యం, బాలల వికాసం, రక్తహీనత నివారణపై అవగాహన కల్పించాలని సూచించారు.