హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోదావరిలోకి దూకిన యువకుడు

కోనసీమ: మలికిపురం మండలం దిండి-చించినాడ బ్రిడ్జిపై నుంచి ఓ యువకుడు బుధవారం మధ్యాహ్నం గోదావరిలో దూకేశాడు. దీంతో స్థానికులు, ప్రయాణికులు పెద్ద ఎత్తున అక్కడ గుమికూడారు. అతని తన సెల్‌ను వంతెన పైనే ఉంచి దూకినట్లు స్థానికులు చెప్తున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.