హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదం.. మంత్రి దుర్గేష్ దిగ్భ్రాంతి

E.G: పెరవలి మండలం పిట్టలవేమవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిడదవోలు నియోజకవర్గానికి చెందిన నేలపూడి ప్రదీప్, కానూరు అగ్రహారానికి చెందిన హరిదాస్ బాలవీర సుబ్రహ్మణ్య సాయిలు మృతి చెందడంపై మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉజ్జ్వల భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువకులు మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.