హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంద్రపాలెంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

KKD: రాబోయే వినాయక చవితిని పురస్కరించుకుని కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెంలోని ఎన్టీఆర్ పార్క్ వద్ద ‘మన ఊరు మన బాధ్యత’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు పంతం సందీప్ పాల్గొని స్థానిక భక్తులకు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు