ASR: కొయ్యూరు మండలం సింగవరంలో బుధవారం వరి పంటపై రైతులకు ఏవో పీ.శివరామ్ ప్రసాద్ పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. 5వ వారం కార్యక్రమంలో భాగంగా చదరపు మీటర్‌కు ఎన్ని వరి పిలకలు ఉన్నాయో, రైతులతో కలిసి లెక్కించారు. పిలకల సంఖ్య ఆధారంగానే వరి దిగుబడి ఉంటుందన్నారు. వరి పంటలో ఎరువులు, కలుపు యాజమాన్యంపై రైతులకు అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
సింగవరంలో పొలంబడి కార్యక్రమం


