హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్రహ్మోత్సవాలపై కలెక్టర్ కీలక ఆదేశాలు

CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. ఏర్పాట్లపై సమీక్షించేందుకు బుధవారం ఆలయ పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళీమోహన్ పాల్గొన్నారు.