హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

HPV టీకాపై విద్యార్థులకు అవగాహన

CTR: గిరింపేటలోని మున్సిపల్ ఉన్నత పాఠశాలలో అల్లు అర్జున్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో హెచ్‌పీవీ టీకాపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి జీజేఎం ఫౌండేషన్‌కు చెందిన గురజాల చెన్నకేశవుల నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 14 ఏళ్ల బాలికలు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. బాలికల తల్లిదండ్రులు వ్యాక్సిన్‌పై అవగాహన పెంచుకోవాలని కోరారు.